ETV Bharat / state

Minister Suresh: 'ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రుల్లో ఆసక్తి'

ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మనబడి.. నాడు-నేడు కార్యక్రమాలతోనే ఈ ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు.

ap-state-education-minister-adimulapu-suresh-
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
author img

By

Published : Aug 14, 2021, 5:29 PM IST

మనబడి, నాడు-నేడు కార్యక్రమాలతో తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. అందుకే.. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. నాడు - నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు.

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులలో 42 లక్షల మంది విద్యార్థులు ఉంటే నాడు- నేడు ప్రభావంతో ఈ సంఖ్య నూతన విద్యా సంవత్సరంలో 48 లక్షలకు పెరిగిందన్నారు. ఈనెల 16న తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మంత్రులు సురేష్, విశ్వరూప్.. ఏర్పాట్లు పరిశీలించారు.

ఇదీ చదవండి:

ఓ వైపు వర్షాలు..మరోవైపు సీఎం జగన్​ పర్యటనకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.