దేశవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుండి 61 రోజులపాటు సముద్రంలో మర పడవలు, బోట్లు, ఇంజిన్ నావలతో సముద్ర సంపదను వేటాడటంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు పది వేల కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. మత్స్యకారులు ఎక్కువగా నివాసం ఉండే బైరవపాలెం, బలుసుతిప్ప తీరంలో బోట్లు ఒడ్డున చేర్చి మరమ్మతులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం గత ఏడాది అందకపోవడంతో... ఈ ఏడాదైనా వస్తాయన్న ఆశతో మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి