తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి కురసాల కన్నబాబు పర్యటించారు. జూన్ నుంచి అక్టోబరు వరకు అధిక వర్షాలు, వరదలతో ఖరీఫ్ పంటలకు నష్టం జరిగిందన్నారు. పంట నష్ట పరిహారానికి సంబంధించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం అందించాలని ఆదేశించారని వెల్లడించారు. కేంద్రం పెట్టుబడి రాయితీ నిధులను అందించేవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రైతులకు సాయం చేసేది కాదన్నారు.
ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.277.67 కోట్లను విడుదల చేశారని చెప్పారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోందన్న మంత్రి... ఈ-క్రాప్‌లో నమోదైతే తక్షణం బీమా వర్తించే విధానం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. రైతులకు పంటల బీమా పరిహారాన్ని మరింత వేగంగా అందించేందుకు ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: