ETV Bharat / state

'యూనిఫాంలో ఉన్నంతకాలం ప్రజా రక్షకులుగా మెలగాలి' - పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వార్తలు

పోలీసులు ఉంది ప్రజల హక్కుల్ని కాపాడేందుకే... రాజకీయ నేతల అభీష్టం మేరకు వ్యవహరించేందుకు కాదని ఉన్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. బ్యూరోక్రట్స్, పోలీసు అధికారులు రాజకీయాల్లో చేరాలని భావిస్తే చేరొచ్చు... యూనిఫాంలో ఉన్నంతకాలం ప్రజా రక్షకులుగా మెలగాలని స్పష్టం చేసింది. మధ్యరాత్రి న్యాయవాది ఇంటికెళ్లారంటే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో ఆలోచించారా అని పేర్కొంది. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో రూల్​ఆఫ్ లా లేనట్లు అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP High Court serious Comments Police Department
న్యాయస్థానం
author img

By

Published : Jul 22, 2020, 2:28 AM IST

న్యాయవాది అక్రమ నిర్బంధం కేసులో కోర్టుకు హాజరైన ఎస్పీని ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై డీజీపీ కమిటీని ఏర్పాటు చేశారని... న్యాయవాది తమ అదుపులో లేరని... తప్పించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టులతో సహా ఎవరూ చట్టం కంటే ఎక్కువ కాదని స్పష్టం చేసింది. న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ఆక్రమ నిర్బంధంపై దాఖలైన వ్యాజ్యంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

రాత్రిపూట ఒంటిగంటకు న్యాయవాది ఇంటికెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఏదైనా నేరస్థుడి ఇంట్లోకి సైతం ఆ తరహాలో ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. రాత్రి సమయంలో న్యాయవాది ఇంటికెళ్లి పోలీసులు వెతికారంటే... ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో ఆలోచించారా అని కోర్టుకు హాజరైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సయీంఅస్మిని ప్రశ్నించింది. ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా' లేనట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.

పోలీసులు ఉంది ప్రజల హక్కుల్ని కాపాడేందుకేకాని.. రాజకీయ నేతల అభీష్టం మేరకు వ్యవహరించేందుకు కాదని స్పష్టం చేసింది. పోలీసు అధికారులకు వ్యతిరేకంగా కోర్టు ఏమైనా ఉత్తర్వులు జారీచేస్తే కష్టాల్లో పడతారని పేర్కొంది. అప్పుడు ఏ రాజకీయ నేత పోలీసుల్ని ఆదుకోవడానికి ముందుకు రారని వ్యాఖ్యానించింది. యూనిఫాంలో ఉన్నంత కాలం ప్రజా రక్షకులుగా మెలగాలని హితవు పలికింది. పోలీసులు ఇంటికెళ్లిన సమయంలో సుభాష్ చంద్రబోస్ తప్పించుకున్నారని, ప్రస్తుతం పోలీసుల అదుపులో లేరని, ఎక్కడున్నారో కనుగొనేందుకు చర్యలు ప్రారంభించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై ఓ కమిటీని ఏర్పాటు చేశారన్నారు.

ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... డీజీపీని పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్పీ సైతం వివరణ ఇస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని పేర్కొంది. అక్రమ నిర్బంధంపై దాఖలైన ఓ వ్యాజ్యంతో ప్రస్తుత వ్యాజ్యాన్ని జత చేయాలని ఆదేశించింది. ఈలోపు న్యాయవాది సుభాష్ చంద్రబోస్​ను పోలీసులు కనుగొంటే హైకోర్టులో హాజరుపరచాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

న్యాయవాది అయిన తన భర్త పైలా సుభాష్ చంద్రబోస్​ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు ఈనెల 18 రాత్రి ఒంటిగంట సమయంలో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని పేర్కొంటూ... ఆయన భార్య వెంకట ప్రియదీప్తి సోమవారం హైకోర్టులో అత్యవసరంగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం... న్యాయవాది బోస్​ను కోర్టులో హాజరుపరచాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణకు ఎస్పీ కోర్టుకు హాజరయ్యారు. జీపీ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ఇంటికెళ్లినప్పుడు బోస్ అక్కడినుంచి తప్పించుకున్నారన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. బోస్​ను పోలీసులు తీసుకెళ్లారన్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్​ను పరిశీలించాలన్నారు కోరారు. బోస్ ప్రాణాలకు హాని ఉందన్నారు.

ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పోలీసులు చుట్టుముట్టి పట్టుకుపోయారని పిటిషనర్ చెబుతోంటే.. దొరకలేదని మీరు ఎలా చెబుతున్నారని ఎస్పీని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో ఆ విధంగా చెబుతున్నారా అని వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలని పేర్కొంది. కోర్టులతో సహా ఎవరూ చట్టం కంటే ఎక్కువ కాదని స్పష్టంచేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది సతీష్ మరోసారి బోస్ ప్రాణహాని గురించి ప్రస్తావిచగా... అందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ఏ పోలీసు అధికారి అలాంటి చర్యలకు పాల్పడే సాహసం చేస్తారని అనుకోవడం లేదంది. ఒకవేళ పాల్పడితే.. దాని ఫలితం ఎలా ఉంటుందో వారికి తెలుసని పేర్కొంది.

పరిస్థితులను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసని వ్యాఖ్యానించింది. మీరు నేరుగా (డైరెక్ట్) ఎస్పీ అయిన వ్యక్తా..? లేక పదోన్నతి పొంది ఎస్పీ అయిన వ్యక్తా అని... ఎస్పీని ఆరా తీసింది. ఎస్పీ స్పందిస్తూ.. నేరుగా ఎస్పీ అయిన వ్యక్తినని బదులిచ్చారు. డైరెక్ట్ ఎస్పీ అయితే చాలా బాధ్యతాయుతంగా ఉంటారనే ఆశాభావం ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రజల హక్కులను రక్షించడంలో మీరు బాధ్యులని పేర్కొంది. ఆ తరహాలో వ్యవహరించాలని సూచించింది. తదుపరి విచారణకు ఎస్పీని హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది.

ఇదీ చదవండీ...మెుహంపై ఎస్సై షూతో తన్నాడు.. నన్ను చంపేస్తారేమో: వరప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.