తూర్పు గోదావరి జిల్లా తునిలోని రాజా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రైతు బజారుకు.. నియమిత వేళల్లో జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిత్యావసరాల కొనుగోళ్ల క్రమంలో.. ఒక్కోసారి సామాజిక దూరాన్ని మరిచిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వైకాపా నాయకులకు సమస్య వివరించారు. పార్టీ నాయకుడు ఏలూరి బాలు.. రైతుబజార్ వద్ద వైరస్ సంహారక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందులోనుంచే ప్రజలు రైతుబజార్‌కు రాకపోకలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు వచ్చి వెళ్లే సమయంలో.. వారిపై ప్రత్యేకమైన ఛాంబర్ నుంచి ఒక శాతం హైపో సోడియం క్లోరైట్ కలిపిన నీరు పిచికారీ అవుతుంది. ఫలితంగా.. వైరస్ వ్యాప్తికి అవకాశాలు తగ్గుతాయని ఆశిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
కరోనా వ్యాప్తి నివారణకు వైరస్ సంహారక మార్గం - కరోనా వ్యాప్తి నివారణకు తుని మార్కెట్ యార్డ్‌లో వైరస్ సంహారక మార్గం
రైతు బజార్లలో కరోనా వ్యాప్తి చెందకుండా... తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైతు బజార్లకు ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉన్న కారణంగా.. వైరస్ సంహారక మార్గాన్ని ఏర్పాటు చేశారు.
![కరోనా వ్యాప్తి నివారణకు వైరస్ సంహారక మార్గం Antiviral pathway for prevention of corona outbreak at tuni market yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6680130-879-6680130-1586155014641.jpg?imwidth=3840)
తూర్పు గోదావరి జిల్లా తునిలోని రాజా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రైతు బజారుకు.. నియమిత వేళల్లో జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిత్యావసరాల కొనుగోళ్ల క్రమంలో.. ఒక్కోసారి సామాజిక దూరాన్ని మరిచిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వైకాపా నాయకులకు సమస్య వివరించారు. పార్టీ నాయకుడు ఏలూరి బాలు.. రైతుబజార్ వద్ద వైరస్ సంహారక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందులోనుంచే ప్రజలు రైతుబజార్‌కు రాకపోకలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు వచ్చి వెళ్లే సమయంలో.. వారిపై ప్రత్యేకమైన ఛాంబర్ నుంచి ఒక శాతం హైపో సోడియం క్లోరైట్ కలిపిన నీరు పిచికారీ అవుతుంది. ఫలితంగా.. వైరస్ వ్యాప్తికి అవకాశాలు తగ్గుతాయని ఆశిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: కొబ్బరికి కరోనా దెబ్బ