MLC Anantha Babu Bail Issue : పోలీసుల నిర్లక్ష్యం వల్లే వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చిందని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. రాజమహేంద్రవరంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముప్పాళ్ల.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగి 210 రోజులైనా ఇప్పటివరకూ పోలీసులు సరైన చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. అనంతబాబు నుంచి తమకు ప్రాణహాని ఉందని సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడిని హత్యచేసిన వ్యక్తికి.. బెయిల్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు తమకు న్యాయం చేయలేదంటూ నూకరత్నం వాపోయారు.
BAIL TO YCP MLC ANATABABU : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ.. బెయిల్ నిబంధనలను ట్రయర్ కోర్టు నిర్దేశిస్తుందని పేర్కొంది. గతంలో పలుమార్లు ఏపీ హైకోర్టులో.. బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజారు చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ పత్రాలు అందిన తర్వాత అనంతబాబును విడుదల చేసే అవకాశముంది.
అసలేం జరిగిందంటే..: సుబ్రహ్మణ్యం.. ఐదేళ్లపాటు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. ఇటీవల కొంతకాలం క్రితం డ్రైవర్ పని మానేసి, ఇంటి దగ్గరే ఉంటున్నారు. గురువారం (2022 మే 19) రాత్రి పదిన్నర గంటలకు స్నేహితులతో కలిసి కాకినాడ కొండయ్యపాలెంలో సుబ్రహ్మణ్యం ఉండగా.. ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఫోన్ చేసి.. నాగమల్లితోట దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని, అక్కడికి రమ్మని పిలిచారు. మళ్లీ రాత్రి ఒకటిన్నరకు అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వెనుక సీటులో వేసుకుని తీసుకొచ్చారు.
మృతదేహాన్ని తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించగా.. నీరు కారుతూ, ఇసుకతో ఉండటంతో అసలేం జరిగిందని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడిగారు. బండి ఢీకొట్టిందని ఎమ్మెల్సీ చెప్పడంతో.. తమకు చెప్పాలి గానీ మీరెలా తీసుకొచ్చారని వారు ప్రశ్నించారు. తనతో గొడవ పడొద్దని, శవాన్ని కిందకు దించాలని ఆయన గద్దించారు. శవాన్ని అలాగే ఉంచాలని, కేసు నమోదయ్యాకే దింపుతామని కుటుంబసభ్యులు స్పష్టంచేశారు. వెంటనే దించి జీజీహెచ్‌కు తీసుకెళ్లాలంటూ కారులో శవాన్ని ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోతుండగా.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఆయన మళ్లీ వచ్చి కారు డోర్ తీసి.. తాళం తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాన్ని అపార్టుమెంట్ వద్దకు తేవటం, అనంతబాబు బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఇవీ చదవండి: