తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకే దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచి ఉంచాలని వ్యాపారులు నిర్ణయించాయి. రెండో దశలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా తీర్మానించినట్లు అనపర్తి వర్తక సంఘం అధ్యక్షుడు వెంకటరామారెడ్డి తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలని కోరారు.
ఇదీ చదవండి: