బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుపాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో మత్స్యకార గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు. పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి భవాని శంకర్ తెలిపారు. తుపాను ప్రభావంతో అంతర్వేది నుంచి కాట్రేనికోన తీరం వరకు సముద్రంలో అలలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఎగసిపడుతున్నాయి.
ఇవీ చదవండి... ఉప్పాడపై అంపన్ ప్రభావం.. ఎగసిపడుతున్న కెరటాలు