తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవీ నవరాత్రులు ముగించుకుని నిర్వహించిన ఈ జాతర మహోత్సవంలో గరగ నృత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. గరగలకు కోళ్లను దిష్టిగా తీసి...గరగను తలపై పెట్టుకుని కోడిని నోటితో కొరికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 40 ఏళ్లలోపే ఊబకాయమా..? అయితే జరభద్రం!