వివిధ శాఖల నుంచి సమగ్ర పరిశీలన నివేదిక అందిన అనంతరం ఇసుక ర్యాంపుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో రాజోలులో 2, శివకోటిలో 1, సోంపల్లిలో 1 చొప్పున ఇసుక ర్యాంపులకు అనుమతుల కోసం వివిధ బోట్స్ మ్యాన్ సొసైటీల దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ ఆయా ర్యాంకులను పరిశీలించారు. రెవెన్యూ, గనులు, భూగర్భ జల, హెడ్ వర్క్స్ శాఖల నుంచి నివేదికలు వచ్చిన అనంతరం సాధ్యాసాధ్యాలను బట్టి ర్యాంపులను తెరిచేందుకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండీ... ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్‌కు.. సీఎస్ లేఖ