భూ తగదాల ఘర్షణల తరువాత, ఓ వ్యక్తి విగత జీవిగా మారడంతో, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం గోరస గ్రామంలో మడికి అర్జన్ రావు, తన సాగు చేస్తున్న భూమితో కొందరికి తగాదా వచ్చింది. ఇరు వర్గాలు మద్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపధ్యంలో అర్జునరావు స్మశానవాటికలో విగత జీవిగా పడిఉండటంతో, వైరి వర్గం వారే ఈ హత్య చేయించారని కుటుంబ సభ్యులు మృత దేహంతో స్థానిక సెంటర్లో ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. తగిన న్యాయం చేస్తామని పోలీసు చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. .
ఇదీచూడండి.అమ్మమ్మ బంగారం... తీసింది ప్రాణం....