అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు వైద్యులు రిక్షాలోనే వైద్యసేవలు అందించిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన పేద మహిళ అపర్ణ(28) దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో అపర్ణను ఆమె తల్లి రిక్షాలో సీహెచ్‌సీకు తీసుకెళ్లారు. అక్కడ పడకలు ఖాళీ లేకపోవడంతో రిక్షా తొట్టెలోనే సెలైన్ పెట్టారు. రెండు గంటల తర్వాత 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఆసుపత్రి వైద్యురాలు రాజకుమారి మాట్లాడుతూ.. అపర్ణ రక్తహీనతతోపాటు కడుపునొప్పితో బాధపడుతూ వచ్చినట్లు చెప్పారు. పడకలు ఖాళీ లేక ప్రాథమిక చికిత్స అందించి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపించామన్నారు.
ఇదీ చదవండీ.. కరోనా మృతదేహాల అంత్యక్రియలకు కేరాఫ్ @ గుంటూరు కొవిడ్ ఫైటర్స్