బోటు ప్రమాదంలో కనిపించకుండా పోయిన అన్న కోసం తమ్ముడు పడుతున్న ఆరాటం కంటతడిపెట్టిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హాలియా గ్రామానికి చెందిన సురభి రవీందర్ గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతు అయ్యాడు. రవీందర్ తో పాటు వెళ్లిన మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా, తన అన్న ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియడం లేదని తమ్ముడు మహేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనిపించిన ప్రతి అధికారిని, పోలీసులకు తన అన్న ఫొటో చూపిస్తూ, అన్నయ్య ఆచూకీ చెప్పండి సార్..అంటూ, దీనంగా వేడుకుంటున్నాడు.
కొలువు ఆనందం నిలవకుండానే...
ఇటీవల తన అన్న సురభి రవీందర్‌కు తెలంగాణ పోలీస్ హౌసింగ్ అవుట్సోర్సింగ్ లో ఏఈగా ఉద్యోగం వచ్చిందని... కుటుంబమంతా ఎంతో సంతోషించామని మహేష్ తెలిపాడు. ఇంతలోనే ఇలా కావడం వల్ల కుటుంబమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయామంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇదీ చూడండి : బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు