తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన 60 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కేశనకుర్తి నాగబాబు వరసకు పెద్దమ్మ అయిన మహిళపై అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎస్పీ హుస్సేన్ బాషా తెలిపారు. అనంతరం ఆమెను హత్య చేసి తప్పించుకునేందుకు ఇల్లంతా కారం చల్లినట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్న 78 వేల 900 రూపాయలు, వెండి ఉంగరాన్ని దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. నిందితుణ్ని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి: