తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 47వ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన - 2019 నిర్వహించారు. సాలిపేటలోని బాలకల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి ప్రదర్శనను ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ ఐవీ రావు ప్రారంభించారు. ఇన్స్పైర్ - 2019 పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు 25 మండలాలకు చెందిన 213 పాఠశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టుల్ని ప్రజా ప్రతినిధులు ఆసక్తిగా పరిశీలించారు. శాస్త్రీయ జిజ్ఞాస, అధ్యయనాలతో తమ మేథేశక్తిని పెంపొందించుకొని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులుగా రాణించాలని ఎంపీ గీత విద్యార్థులకు పిలుపునిచ్చారు. సృజనాత్మక సామర్థ్యాల్ని వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు మంచి వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్సీ ఐవీ రావు అన్నారు.
ఇవీ చూడండి: