కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ఓ మత్స్యకారుడి పంట పండింది. వేట ఫలించింది. 25 కిలోల బరువు కలిగిన అరుదైన కచిడి చేప ఆ మత్స్యకారుడి వలకు చిక్కింది. ఔషధ గుణాలు కలిగిన ఈ చేప మార్కెట్లో 43 వేల రూపాయలకు అమ్ముడుపోయి.. అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.
లాక్డౌన్ కారణంగా కృష్ణా జిల్లాలో ఈ చేపను విక్రయించేందుకు వీలుపడక.. మత్స్యకారుడు తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పల్లెపాలెం వద్ద గల ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చాడు. ఈ కచిడి చేప గురించి తెలిసిన ఓ వ్యాపారి... ఏకంగా 43 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఈ చేపకు పొట్ట భాగంలో మరిన్ని ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని ఆ భాగాన్ని వ్యాపారి పదిలపరిచాడు. మిగిలిన భాగాన్ని డిమాండ్‌ను బట్టి కేజీ 400 రూపాయలు చొప్పున అమ్మేశాడు. ఆ విక్రయదారుడు పశ్చిమ బెంగాల్‌లోని హవడాకు తీసుకెళ్లి విక్రయించనున్నట్లు చెప్పాడు.
ఇవీ చూడండి: