తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 120వ వార్షిక మహా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా మహాసభలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పీఠం 2020 నివేదిక గ్రంథాన్ని ఉమర్ అలీషా ఆవిష్కరించారు. ఈ మహాసభలకు సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈర్ష్య, ద్వేషాలు వదిలేసి ప్రేమ, దయ, కరుణ పెంపొందించుకునేందుకు ప్రతీ ఒక్కరూ సాధన చేయాలని డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఇవీ చూడండి: