యానాం జిల్లాలోని దరియాలతిప్ప గ్రామంలో దివ్యవాణి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతోంది. సోమవారం ఇంటిలో చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంటి బయటే ఉన్నారు. కుమార్తె ఎంతసేపటికీ తలుపు తెరవకపోవటంతో కిటికీ నుంచి చూడగా దివ్యవాణి ఉరికి వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి