ETV Bharat / state

తిరుపతిలో వైకాపా నేతల పాదయాత్ర - bhoomana karunakar reddy news

తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్​రెడ్డి అధ్యక్షతన వైకాపా నేతలు, కార్యకర్తలు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందని కరుణాకర్​రెడ్డి అన్నారు.

padayatra
వైకాపా నేతల పాదయాత్ర
author img

By

Published : Nov 6, 2020, 12:58 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నేతలు తిరుపతిలో పాదయాత్ర నిర్వహించారు. శాసనసభ్యుడు భూమన కరుణాకర్​రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత నేత వై.ఎస్​.రాజశేఖర్​రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.

ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్​ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారని కరుణాకర్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత నాయకులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శానిటైజర్ గొడుగు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.