చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్ వార్డు సచివాలయంలో.. వైకాపా నేత వీరంగం సృష్టించాడు. మహిళా కార్యదర్శిని దుర్భాషలాడుతూ.... మరో ఇద్దరిపై దాడికి దిగాడు. ఓ వాలంటీర్ తొలగింపు విషయమై.. సంబంధిత వార్డు వైకాపా ఇంఛార్జి ప్రకాశ్ రెడ్డి.. మహిళా కార్యదర్శిని దూషించాడు. అక్కడే ఉన్న వార్డు సంక్షేమ అభవృద్ధి కార్యదర్శి, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి.. ప్రకాశ్ రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిపై ప్రకాశ్ రెడ్డి చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: