చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో నాటుసారా అమ్ముతున్న కేంద్రాలపై తనిఖీ చేస్తున్న ఎక్సైజ్ అధికారులపై.... స్థానిక వైకాపా నాయకుడు దాడికి దిగారు. తిరుపతి శివారులోని శెట్టిపల్లి పంచాయతీ బొమ్మల క్వార్టర్స్ దగ్గర నాటుసారా విక్రయిస్తున్నారంటూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు సమాచారం అందింది. ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు.
దుకాణం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులపై యజమానితో పాటు శెట్టిపల్లి గ్రామ పంచాయితీ వైకాపా అధ్యక్షుడు శివశంకర్ రాజు అక్కడికి చేరుకుని వారిపై దౌర్జన్యానికి దిగాడు. అమ్ముకుంటాం ఏం చేస్తారు.. అంటూ రెచ్చిపోయాడు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఎస్సైని, మరో కానిస్టేబుల్ని గాయపరిచాడు. ఎస్ఈబీ అధికారులు అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. వైకాపా నాయకుడు శివశంకర్ రాజు తో పాటు మరో ముగ్గురిని వారు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: