తిరుపతి పట్టణంలో అన్నారావు సర్కిల్ సమీపంలోని అపార్ట్మెంట్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చరణ్ శశిధర్ రెడ్డి(21)గా గుర్తించిన పోలీసులు... వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయన్నారు. మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అద్దె కోసం యజమాని వేధింపులు.. భరించలేక వ్యక్తి ఆత్మహత్య