చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన మునిరత్నం(22), పావని(18) ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఈ నెల 16న ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో పావని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులకు మణింద్రం వద్ద పావని మృతదేహం కనిపించింది. మునిరత్నం చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
పావని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇరువురి మధ్య మనస్పర్థలు ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం