చిత్తూరు జిల్లా రాయలచెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Gurumurthy first aid to CPI Narayana leg injury) రామచంద్రపురం మండలం కుప్పం బాదూరుకు వచ్చారు. అక్కడినుంచి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. కొండ దిగే సమయంలో నారాయణ కుడి కాలు బెణికింది. కాలు వాపు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చుండిపోయారు. అదే సమయంలో చెరువు కట్టను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడికి వచ్చారు.
నడవలేక అక్కడే కూర్చుని ఉన్న నారాయణను వారు పలకరించారు. కాలు బెణికిన విషయం తెలుసుకున్న ఎంపీ డాక్టర్ గురుమూర్తి గాయాన్ని పరిశీలించారు. ఫిజియోథెరపీ చేసిన అనంతరం తాత్కాలికంగా కట్టు కట్టారు. తదుపరి చికిత్స కోసం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఇదీ చదవండి
AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?