Ysrcp Leaders Land Occupation: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి. కొత్తకోట పంచాయతీ తిరుమల కొండయ్యగారిపల్లిలో భారీ భూ ఆక్రమణకు కొంతమంది యత్నించారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 1373, 1374లో సుమారు 17 మంది 120 ఎకరాల గుట్ట ప్రాంతంలోని పశువుల మేత భూమిని కబ్జా చేయడానికి యత్నించారని.. వీరికి వైకాపా నాయకుల అండదండలున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడకు చేరుకుని భూ ఆక్రమణను అడ్డుకున్నారు. అనంతరం ఆర్డీవో రేణుక సంఘటనా స్థలాన్ని పరిశీలించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలకు యత్నించిన 17 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ విజయభాస్కర్ తెలిపారు.
ఇవీ చదవండి: