చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మొలకలదిన్నెలో నెలకొన్న భూవివాదం ఓ వ్యక్తి అపహరణకు దారి తీసింది. తన భర్త శ్రీరాములును కిడ్నాప్ చేశారంటూ మాధవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ శ్రీనివాసులు, అతని కొడుకు తనీష్‌లు.. ఈ అపహరణ వెనక ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారితో పాటు కిడ్నాప్‌నకు సహకరించిన శేఖర్‌బాబు, వినోద్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భూవివాదమే ఘటనకు కారణమని ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి