కొవిడ్ పాజిటివ్ వచ్చిందని అనుమానంతో ఓ మహిళను గ్రామస్థులు ఊరి నుంచి వెలివేశారు. గ్రామం బయటు ఉన్న చెట్టుకింద ఉండాలంటూ ఆంక్షలు విధించారని 35 ఏళ్ల బాధితురాలు వాపోయింది. చిత్తూరు జిల్లా యర్రావారిపాళెం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కరోనా కారణంగా వివక్ష చూపడం తగదని వాలంటీర్ వారించినా వినకుండా.. గ్రామం వెలుపలే ఉంచారని ఆమె తెలిపింది. తనకు అండగా నిలిచిన వాలంటీర్లపై గ్రామస్థులు దురుసుగా ప్రవర్తించారని పేర్కొంది. విషయాన్ని మండల స్థాయి అధికారుల వరకు తీసుకువెళ్లగా.. 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: