చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం ముత్తుకూరు గ్రామంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. ముత్తుకూరు గ్రామానికి చెందిన మహిళ పశువులకు మేత కోసం వేరేవాళ్ల పొలాల్లోకి వెళ్లి ... ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో గుర్తించలేదు. కాసేపటి తరువాత పొలం యజమాని బావి వద్దకు వచ్చి... ఆమె మృతి చెందిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే మృతురాలి కుమార్తెకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: కుమార్తెను చూసొద్దామనుకుంది... అంతలోనే అనంతలోకాలకు