మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పరిటాల సునీత రెండో కుమారుడు సిద్ధార్థ వివాహ శుభలేఖతో కలసి ఆలయానికి చేరుకున్నారు. ఈ నెల 28న సిద్ధార్థ వివాహం ఉన్నందున... మొదటి వివాహ ఆహ్వాన పత్రికను స్వామి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందామని సునీత తెలిపారు. రాజధాని సాధనకు ఆందోళనకారులు 50 రోజులుగా చేస్తున్న ఉద్యమం... 100 రోజులైనా ఇదే రీతిలో ఉంటుందని రాయపాటి అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని...పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దర్శించుకున్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పరిటాల సునీత రెండో కుమారుడు సిద్ధార్థ వివాహ శుభలేఖతో కలసి ఆలయానికి చేరుకున్నారు. ఈ నెల 28న సిద్ధార్థ వివాహం ఉన్నందున... మొదటి వివాహ ఆహ్వాన పత్రికను స్వామి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందామని సునీత తెలిపారు. రాజధాని సాధనకు ఆందోళనకారులు 50 రోజులుగా చేస్తున్న ఉద్యమం... 100 రోజులైనా ఇదే రీతిలో ఉంటుందని రాయపాటి అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని...పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు.
ఇదీ చదవండి: ఎస్వీబీసీ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి