తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి దెబోశ్రీ చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకార సేవ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండీ... తితిదే సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన బాలుడి వేలు