వి.కోటలో తాగునీటి కోసం గ్రామస్థుల ధర్నా - ముమ్మడేర్లపల్లెలో తాగునీటి కోసం ధర్నా
చిత్తూరు జిల్లా వి.కోట మండలం ముమ్మడేర్లపల్లెలో తాగునీటి కోసం గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామస్థులు వేస్తోన్న బోరును అధికారులు అడ్డుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరు నెలలైనా తాగునీటి సమస్య పరిష్కరించట్లేదని గ్రామస్థులు మండిపడ్డారు. బోరు డ్రిల్లింగ్ ఆపేసిన లారీ యాజమానిని బోరు వేసే వరకు బండిని పంపేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అధికారులు స్పందిస్తూ 800 అడుగుల లోతు బోరు వేస్తే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.