దిల్లీ తితిదేలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మూడు రోజులుగా చేసిన దర్యాప్తులో.. 4 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. స్వామి వారికి అలంకరించే పూల మాలలు, అమ్మవారికి సమర్పించే చీరల మొదలు అన్నింటా అవకతవకలు జరిగాయని తెలిపారు. రికార్డుల నిర్వహణలోనూ లోపాలు గుర్తించామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు విజిలెన్స్ డిఎస్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: