చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పౌరసరఫరాల గోదాములో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆ గోదాముకు రావాల్సిన 20 టన్నుల బియ్యాన్ని ఏర్పేడు నుంచి తమిళనాడు తరలిస్తుండగా మార్గమధ్యంలో నగరి వద్ద తిరుపతి విభాగానికి చెందిన విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు... బియ్యం గంగాధర నెల్లూరు మండలం గోదాముకు చేరాల్సినట్లు గుర్తించి సోదాలు నిర్వహించారు.
10 బస్తాల గోధుమలు, 20 బస్తాల శనగలు తక్కువ గా ఉన్నట్లు గుర్తించారు. గోదాములో ఉండాల్సిన బియ్యం నిల్వల కంటే 210 బస్తాలు, 27 లీటర్ల పామాయిల్ ప్యాకెట్లు అదనంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులు మహేష్ పై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
'ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోటం లేదు'