ETV Bharat / state

పదోన్నతులు కల్పించాలని ఉద్యోగుల ఆందోళన

తమకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎస్వీయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్వీయూ వార్షిక బడ్జెట్​ను పెంచాలని డిమాండ్ చేశారు. పదోన్నతుల జాప్యం వల్ల తమకు నష్టం కలుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతభత్యాలు ఆలస్యంగా ఇస్తున్నారని.. సకాలంలో చెల్లించాలని కోరారు.

darna
author img

By

Published : Sep 20, 2019, 4:42 PM IST

పదోన్నతులు కల్పించాలని ఉద్యోగుల ఆందోళన

.

పదోన్నతులు కల్పించాలని ఉద్యోగుల ఆందోళన

.

Intro:AP_cdp_48_20_antarjatiya calls_3 vyakuu_Arrest_Av_Ap10043
k.veerachari 9948047582
ఇతర దేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ని రిసీవ్ చేసుకుని అక్రమ మార్గంలో ప్రజలకు కనెక్ట్ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కడప జిల్లా రాజంపేట టెలిఫోన్ శాఖకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ ముమ్మరం చేసిన పోలీసులు అంతర్జాతీయ కాల్స్ ని రిసీవ్ చేసుకునే కేంద్రంపై దాడి చేసి ఐదువందల సిమ్ కార్డు లతోపాటు కంప్యూటర్లు, లాప్ టాప్ లు, సిమ్ము లను అమర్చే ప్రత్యేక పరికరాన్ని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు రాజంపేట డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా ముందు నిందితులను, స్వాధీనం చేసుకున్న పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన న మాట్లాడుతూ సాధారణంగా వివిధ దేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గేట్ వే వద్ద రికార్డు అయి వస్తాయని తెలిపారు. ఇలా రికార్డ్ చేసిన కాల్ ఎవరు చేశారు ఎక్కడినుంచి చేశారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. కానీ గేట్వే వద్ద రికార్డ్ కాకుండా నేరుగా వచ్చే కాల్స్ తో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ని గేట్వే లో రికార్డు కాకుండా నేరుగా రాజంపేటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరికరానికి చేరుతాయని, ఇక్కడినుంచి స్థానిక సిమ్ కార్డుల ద్వారా ప్రజలకు కాల్స్ వెళ్తాయని వివరించారు. దీనివల్ల ఆ కాల్ బయట నుంచి వచ్చిందనే విషయం తెలియదని చెప్పారు. భారతదేశంలో నిషేధించిన ఓ పరికరాన్ని ఉపయోగించి అంతర్జాతీయ కాల్ ని స్థానిక కాల్స్ గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. ఈ వ్యవహారంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సూత్రధారని, అతను ప్రస్తుతం కువైట్ లో ఉన్నట్లు చెప్పారు. కార్యాలయంలో పని చేస్తున్న మహమ్మద్ షరీఫ్ తో పాటు సిమ్ కార్డులను సరఫరా తీసిన రాజు, రాజశేఖర్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. భారత దేశము నిషేధించిన ఆ పరికరం ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు సిమ్కార్డులు ఎలా వచ్చాయి విషయాలపై విచారిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శుభకుమార్ పోలలు పాల్గొన్నారు.


Body:అంతర్జాతీయ కాల్స్ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్


Conclusion:డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.