చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం వలసరెడ్డిగారిపల్లికి చెందిన రాజకీయ కురువృద్ధుడు, మాజీ జెడ్పీటీసీ వీ సిద్ధరామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఆయన సన్నిహితుడిగా మెలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సిద్ధరామిరెడ్డి సమీప బంధువు. ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా సేవలు అందించారు. స్వగ్రామైన వలసరెడ్డిగారిపల్లిలోనే ఎక్కువ ఉండేందుకు ఇష్టపడే సిద్ధరామిరెడ్డి, అక్కడే తుది శ్వాస విడిచారు. నేడు 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: 60 లీటర్ల నాటుసారా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్