చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. రైటర్ సత్యనారయణ, అసిస్టెంట్ రైటర్ పురుషోత్తం రెడ్డి ఇద్దరూ.. ఒకేరోజు పదవీ విరమణ పొందగా.. ఆ పోలీస్ స్టేషన్లో సందడి నెలకొంది. సీఐ రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన వీడ్కోలు కార్యాక్రమానికి డీఎస్పీ నరసప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏ ఉద్యోగి అయినా పదవీ విరమణ పొందడం సహజమని డీఎస్పీ చెప్పారు. సుమారు మూడున్నర దశాబ్దాలు.. సమాజం కోసం అహర్నిశలు కష్టించి.. పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది జీవితాలు సార్థకమని ప్రశంసించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది.. సీఐ శివ ప్రసాద్ తో కలిసి ఇద్దరిని ఘనంగా సన్మానించారు.
ఇదీ చదవండి: