బయటి ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మదనపల్లె రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని చంద్ర కాలనీకి చెందిన లక్ష్మన్న, రామాచారిపల్లికి చెందిన ముని స్వాములు భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తుండగా రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 224 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: పాడె పైనుంచి లేచినా ప్రాణం మిగల్లేదు!