కరోనా కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తిరుపతి జేఈఓ సదాభార్గవి అన్నారు. బాలమందిర్, బదిర పాఠశాల, కళాశాలను తనిఖీ చేసిన ఆమె... వసతి గృహాల్లోని వంటగదులు, విద్యార్థుల గదులు, తరగతి గదులను పరిశీలించారు. హాస్టల్ గదుల్లో విద్యార్థుల మంచాల మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో పరిశుభ్రతను పాటించాలన్నారు. బాలమందిర్ భవనాలకు సున్నం వేయించి, పూల మొక్కలు పెంచి సుందరీకరించాలని చెప్పారు.
ఇదీచదవండి.