స్వామివారి సంకల్పంతోనే తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఉద్ఘాటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్‌లోని విశాఖ శ్రీ శారద పీఠం ఆశ్రమంలో... మూడు నెలలుగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామీజీని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిశారు. తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు పొందారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తితిదే చేపట్టిన అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సుందరకాండ, విరాటపర్వ పారాయణాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. కరోనా కారణంగా అర్చకులకు, భక్తులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.
ఇదీ చదవండి: