అంజనీపుత్రుడు, పవనసుతుడు ఆంజనేయుడి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు.. తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకూ 5 రోజుల పాటు హనుమాన్ జయంతిని జరుపుతామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కోరోజు ఒక్కోరకం పుష్పాలతో ఆంజనేయుడికి అభిషేకం, అర్చన నిర్వహిస్తామని చెప్పారు. ఆంజనేయస్వామి జన్మస్థలం ఆకాశగంగ తీర్థమని మరోసారి తితిదే తరపున స్పష్టం చేస్తున్నామన్న ఆయన..ఆకాశ గంగలో అంజనీదేవి తపస్సు చేశారని తెలిపారు. తిరుమలగిరుల్లోనే ఆంజనేయస్వామి పుట్టాడని ప్రకటించిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న వేడుకలు కావటంతో ప్రతిష్టాత్మకంగా చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.
హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని.... హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ స్వామి గోవిందానంద సరస్వతీ ప్రకటనలు వారి వ్యక్తిగతానికి వదిలేస్తున్నట్లు అదనపు ఈవో చెప్పారు. పురాణాలు, రామాయణం, వాంజ్ఞ్మయంలో ఉన్నవాటిని సంకలనం చేశాకనే మారుతి జన్మస్థలంగా తిరుమలను ప్రకటించామన్నారు. ఐదు రోజుల పాటు వేడుకలను జయప్రదం చేయటం ద్వారా...మారుతి జన్మస్థలంపై వస్తున్న వివాదాలన్నింటినీ శాంతింపజేయాలని తితిదే భావిస్తోంది.
ఇదీ చదవండి: