తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి కపిలతీర్థం నంది కూడలి వరకు గరుడ వారధి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్, తితిదే సంయుక్తంగా 684 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆరు కిలోమీటర్ల వరకు గరుడ వారధి నిర్మాణాలు చేపట్టారు.
458 కోట్ల రూపాయలు తితిదే...226 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఖర్చు చేయవలసి ఉండగా...తితిదే తొలి విడతగా 25 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండో విడతగా 25 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ఈఓ తెలిపారు.
ఆర్టీసీ బస్టాండ్ నుంచి నంది కూడలి వరకు వారధి పనులు పూర్తి కావచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ఈవోకు వివరించారు. ఆగస్టు నెలాఖరు వరకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: