ETV Bharat / state

తితిదేలో అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలను పెంచాలి: జవహర్ రెడ్డి - ఈవో జవహర్ రెడ్డి వార్తలు

తిరుపతిలో భక్తుల అన్నప్రసాదం విభాగంపై తితిదే ఈవో జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్నప్రసాద పంపిణీ కేంద్రాలను పెంచాలని ఈవో ఆదేశించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందు వల్ల వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ttd eo jawahar reddy review meeting in tirupathi
తితిదేలో అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలను పెంచాలి: జవహర్ రెడ్డి
author img

By

Published : Feb 25, 2021, 9:09 PM IST

తిరుమలలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలు పెంచాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. తితిదే పరిపాలనా భవనంలో అన్నప్రసాదం విభాగంపై సమీక్ష నిర్వహించారు. భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నందు వల్ల పీఎసీ 1, 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లో అల్పాహారం, అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.

భక్తుల సంఖ్య పెరుగుతున్నందు వల్ల వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈవో అన్నారు. మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లోని వంటశాలల్లో ఆధునిక వంటసామగ్రి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్న ప్రసాదం విభాగం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దశల వారీగా అన్న ప్రసాదం అందిస్తున్న భక్తుల సంఖ్య, సేవలు ఎలా పెరుగుతూ వచ్చాయనే విషయంపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొవిడ్ సమయంలో బాధితులకు, లాక్​డౌన్ సమయంలో పేదలు, కూలీలకు లక్షలాదిమందికి అన్న ప్రసాదం పంపిణీ చేసిన వివరాలను తెలియజేశారు. సమావేశంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అన్నదానం డిప్యూటి ఈవో నాగరాజు, కేటరింగ్ ఆఫీసర్ జీఎల్​ఎన్ శాస్త్రి పాల్గొన్నారు.

ఇదీ చదవండి

ఆన్​లైన్​లో మార్చి నెల తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.