తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వర శిల్ప కళాశాలను ఈవో జవహర్ రెడ్డి సందర్శించారు. కళాశాలలోని ఆరు డిప్లొమో కోర్సుల తరగతి గదులు, కలంకారీ పెయింటింగ్ విభాగాన్ని పరిశీలించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధానాలను సంబంధిత అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి కళాశాల ఇంకెక్కడా లేదని అధ్యాపకులు ఈవోకు వివరించారు. కోర్సు పూర్తి అయ్యాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఈవో ఆరా తీశారు.
కళాశాలలో ప్రస్తుతం 125 మంది విద్యార్థులున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన చెక్క విగ్రహాలను...లేపాక్షి సంస్థ ద్వారా విక్రయించేందకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని ఈవో అధికారులను ఆదేశించారు . రాతివిగ్రహాలు తయారుచేసే విభాగాన్ని పరిశీలించి, విగ్రహాల తయారీకి రాతిని సమకూర్చుకునే పద్ధతులను తెలుసుకున్నారు. రామతీర్థానికి 10 రోజుల్లోనే విగ్రహాలు తయారు చేసి పంపామని శిల్పులు ఈవోకు వివరించారు.
ఇదీ చదవండి