స్టేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ తిరుపతి శాఖ ఈ ఏడాది కుండ ఇడ్లీ తయారు చేసింది. భారత పాక సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కుండ ఇడ్లీ వంటకాన్ని రూపొందించారు. అల్యూమినియం, స్టీల్ పాత్రల్లో తయారు చేసిన ఇడ్లీ కంటే మట్టి పాత్రలో వండిన ఇడ్లీ రుచికరంగా ఉడటంతోపాటు పోషకాలు అదనంగా లభ్యమవుతాయని తిరుపతి కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాలైన ఇడ్లీల తయారీపై కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు తయారు చేసిన కుండ ఇడ్లీ, బుట్ట ఇడ్లీ, తట్ట ఇడ్లీ, సన్న ఇడ్లీ, బియ్యపు ఇడ్లీలు ప్రదర్శించారు. పర్యావరణహితమైన విధానంలో అధిక పోషకాలు లభించేలా ఇడ్లీల తయారీ చేపట్టామని వివరించారు.
ఇదీ చూడండి 1న కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన