ETV Bharat / state

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్

కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరివారంలో ఫిజికల్ టెస్ట్ - ఈ నెల 11 నుంచి 21 వరకు slprb.ap.gov.inలో దరఖాస్తు చేసుకునే అవకాశం

AP Police Constable Physical Test 2024 Start
AP Police Constable Physical Test 2024 Start (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

AP Police Constable Physical Test 2024 Start : నిలిచిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పోలీసురిక్రూట్ మెంట్ బోర్డు ఇన్ ఛార్జ్ ఛైర్మన్ ఆకే రవికృష్ణ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు .

గత ప్రభుత్వంలో 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది జనవరిలో నిర్వహించిన ప్రిమిలినరీ పరీక్ష నిర్వహించారు. 4,59,182 మంది ప్రిమిలినరీ పరీక్షకు హోజరు కాగా 95,208 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు. 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఫిజికల్ టెస్ట్​కు ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు. ఫిజికల్ టెస్ట్ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ తెలిపారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం 3 నుంచి 21 వతేదీ సాయంత్రం 5 గంటల వరకు slprb.ap.gov.in వెబ్ సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రిమిలినరీ పరీక్ష అనంతరం కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలిచిన భర్తీ ప్రక్రియను తాజాగా ప్రారంభించింది.

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - నియామక ప్రక్రియపై హోంమంత్రి ఏమన్నారంటే - POLICE CONSTABLE RECRUITMENT 2024

SSC భారీ నోటిఫికేషన్​ - పదో తరగతి అర్హతతో - 39481 (GD) కానిస్టేబుల్ పోస్టులు భర్తీ! - SSC GD Notification 2025

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.