తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు తితిదే త్వరలోనే కంపోస్టబుల్ ఎకోలాస్టిక్ సంచుల్లో అందించనుంది. బెంగళూరులోని డీఆర్‌డీవో ఎకోలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో పర్యావరణ అనుకూల సంచులను తయారుచేసింది. వీటి వాడకానికి అనుమతించిన తితిదే.. ధరలు ఖరారు చేసింది.
ఐదు లడ్డూలు పట్టే చిన్న సైజు సంచికి రూ.2, పది చిన్న లడ్డూలు లేదా మూడు పెద్ద లడ్డూలు పట్టే మధ్యరకం సంచికి రూ.5 చొప్పున తీసుకోనుంది. బుధవారం తయారీ సంస్థ ప్రతినిధులు కంపెనీ ఉత్పత్తులను స్వామివారి వద్ద ఉంచి ఆశీర్వాదం అందుకున్నారు. త్వరలోనే లడ్డూ విక్రయ కేంద్రంలో సంచులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: