నగరపాలక సంస్థ అధికారుల కృషి, పారిశుద్ధ్యసిబ్బంది శ్రమ, తిరుపతి ప్రజల సహకారం వల్లే.... నగరానికి త్రీస్టార్ ర్యాకింగ్ దక్కిందని ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టానికి ఫలితమే ఈ ర్యాంకు అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. కేవలం మూడు మార్కుల తేడాతో..ఫైవ్ స్టార్ రేటింగ్ చేరుకోలేకపోయామన్న కమిషనర్ గిరీషా... వ్యర్థాల నిర్వహణలో పక్కా ప్రణాళికలను రచించటం ద్వారా 3స్టార్ ర్యాంకింగ్స్లో జాతీయ స్థాయి ప్రథమ స్థానాన్ని తిరుపతి కైవసం చేసుకోగలిగిందన్నారు.
ఇదీచూడండి. చంద్రగిరిలో చిక్కుకున్న వలసకూలీల నిరసన