ఎల్. ఆర్.ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించడంతో పాటు భవన నిర్మాణాల అనుమతులను త్వరగా మంజూరు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగ అధికారులను తిరుపతి నగర పాలక కమిషనర్ గిరీషా ఆదేశించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, వార్డు ప్లానింగ్ సెక్రెటరీలతో సమీక్ష నిర్వహించిన ఆయన.. నగర పాలక సంస్థ పరిధిలో కొత్తగా చేపడుతున్న బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించాలని సూచించారు.
నిబంధనల మేరకు నిర్మాణాలు సాగుతున్న తీరును పరిశీలించాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రహదారులపై ఇసుక, భవన నిర్మాణ వ్యర్థాలు వేసే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. అక్రమ కట్టడాలను మొదటి దశలోనే అడ్డుకోవాలని, మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి...: సామాజిక మాధ్యమాల్లో గీత దాటితే కేసులే: అర్బన్ ఎస్పీ