తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను రద్దుచేయాలని.. ఫలితాలు ప్రకటించకుండా నిలువరించాలని కోరుతూ... భాజపా అభ్యర్థి రత్నప్రభ దాఖలు చేసిన వ్యాజ్యంపై.. హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు వద్దకు సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా... రిట్ నిబంధనల ప్రకారం దీనిపై ధర్మాసనం విచారణ జరపాలని..... పిటిషనర్ తరఫు న్యాయవాది.. సాయిసంజయ్, ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ తెలిపారు. దీంతో ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి.. హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
ఇవీ చదవండి