తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నిర్వహణపై తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు.. నగరపాలక, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీసు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిమితికి మించి నగదు, విలువైన వస్తువులు తరలించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు జరిగేలా అధికారులు తమ బాధ్యతలు నిర్వహించాలని ఎస్పీ అన్నారు. చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని.. డబ్బు, మద్యం వంటి వాటితో ప్రలోభాలకు గురిచేసే వారిపై నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: బడ్జెట్: మూడు నెలలకు రూ. 86 వేల కోట్లు !